అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది!
- 15 లక్షల కేసులను విశ్లేషించిన అధ్యయనం
- ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ
- ఆహార నాళ క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల
- లుకేమియా, గ్లియోమాతోనూ లింక్ ఉన్నట్లు వెల్లడి
- ఊబకాయం కీలక ప్రమాద కారకమని తేల్చిన పరిశోధన
ఒకప్పుడు అధిక బరువు అంటే గుండె జబ్బులు, షుగర్ సమస్యలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు ఆ జాబితాలో క్యాన్సర్ కూడా చేరుతోంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ అధ్యయనం ఒక ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. శరీర బరువు ఎక్కువగా ఉంటే 19 రకాల క్యాన్సర్ల ముప్పు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన 226 పరిశోధనలను పరిశీలించారు. దాదాపు 15 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషించారు. ఫలితాలను ప్రముఖ జర్నల్ నేచర్ మెటబాలిజంలో ప్రచురించారు. పరిశోధనలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరిగే కొద్దీ కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతున్నట్లు తేలింది. బీఎంఐ అనేది ఎత్తుకు తగ్గ బరువు ఎంత ఉందో చెప్పే ప్రమాణం.
ముఖ్యంగా గర్భాశయం లోపలి పొరలో వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఆహార నాళంలో వచ్చే ఈసోఫేజియల్ అడెనోకార్సినోమా క్యాన్సర్లతో బరువుకు సంబంధం ఉన్నట్లు తేలింది. బీఎంఐలో ప్రతి ఐదు యూనిట్ల పెరుగుదలతో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదం 58 శాతం, ఈసోఫేజియల్ అడెనోకార్సినోమా ప్రమాదం 47 శాతం పెరుగుతున్నట్లు అధ్యయనం తెలిపింది. ఇప్పటి వరకు పెద్దగా చర్చకు రాని కొన్ని క్యాన్సర్ల విషయంలో కూడా ఇదే ధోరణి కనిపించింది. లుకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా, మూత్రాశయ క్యాన్సర్, మెదడులో వచ్చే గ్లియోమా ట్యూమర్ల ముప్పు కూడా అధిక బీఎంఐతో పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
అధిక బరువు ఎందుకు ప్రమాదకరమనే ప్రశ్నకు కూడా శాస్త్రవేత్తలు కొన్ని కారణాలు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ సమస్యలు వస్తాయి. ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఇవి కణాల అసాధారణ పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అదే క్యాన్సర్‌కు కారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, అధిక కొవ్వు శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది. కొన్ని అవయవాల పరిమాణం, పనితీరులో మార్పులు తీసుకురావచ్చు. దీంతో క్యాన్సర్‌కు దారితీసే కణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే అన్ని రకాల క్యాన్సర్ల విషయంలో ఒకే ఫలితం రాలేదు. మెనోపాజ్‌కు ముందు వచ్చే కొన్ని రొమ్ము క్యాన్సర్ల ప్రమాదం అధిక బీఎంఐ ఉన్న మహిళల్లో కొంత తక్కువగా కనిపించింది. కానీ దీన్ని బరువు ఎక్కువగా ఉండటం మంచిదనే అర్థంలో తీసుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.